వాషింగ్టన్: అణ్వాయుధ నిల్వలపై అమెరికా-రష్యా చేసుకున్న అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం గడువు ఈ నెల 5తో ముగియనుంది. ఈ ఒప్పందం కనుక తిరిగి కొనసాగకపోతే అణ్వాయుధ నిల్వలపై ఇరు దేశాలపై ఉన్న పరిమితులు తొలగిపోతాయి. అదే కనుక జరిగితే ప్రపంచానికి తీవ్ర అణ్వాయుధ ముప్పు పొంచి ఉన్నట్టే. కాగా, ఈ ఒప్పందాన్ని కొనసాగించేందుకు అమెరికా కనుక ముందుకు వస్తే తాము కూడా ఇంకో ఏడాది పాటు పొడిగించడానికి సిద్ధమేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల ప్రకటించారు. అయితే దీనిపై అగ్రరాజ్యం నుంచి స్పందన రాలేదు. దీనిపై ట్రంప్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని వైట్‌హౌస్ తెలిపింది. అణ్వాయుధ నిల్వలకు సంబంధించి రెండు దేశాల మధ్య 1972లో తొలి ఒప్పందం కుదిరింది. తర్వాత అది కొనసాగుతూ వస్తున్నది.