లండన్, ఆగస్టు 15: సౌరకుటుంబానికి ఆధారమైన సూర్యుడు ఎప్పుడు మృత నక్షత్రంగా మారుతాడోనన్న విషయాన్ని యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన గియా స్పేస్ అబ్జర్వేటరీ తాజాగా అంచనా వేసింది. 1011 బిలియన్ సంవత్సరాలకు (1.01 లక్ష కోట్లు) చేరుకోగానే సూర్యుడు అంతర్థానం అవుతాడని పేర్కొంది.
కేంద్రక సంలీనం ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ అణువులను హీలియం అణువులుగా మారుస్తూ సూర్యుడు క్రమంగా ద్రవ్యరాశిని కోల్పోతాడని వెల్లడించింది. ఇలా చివరి దశలో మృత నక్షత్రంగా మారుతాడన్నది. ప్రస్తుతం సూర్యుడి వయసు 457 కోట్లు ఏండ్లు.