తెగిపోయిన కాలు పెరగొచ్చు!

- కప్పపై ప్రయోగం సక్సెస్
- అమెరికా శాస్త్రవేత్తల ఘన విజయం
వాషింగ్టన్: కాలు విరిగిపోతే కొయ్యకాలు పెట్టుకుంటాం.. కానీ ఇకనుంచి ఆ అవసరం ఉండదేమో. విరిగిన చోటునుంచే చక్కగా కాలును మళ్లీ పెంచుకోవచ్చు. ఇదంతా కాకమ్మ కబుర్లలా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. తెగిపోయిన శరీరభాగాలు పెంచుకునే ప్రక్రియను టఫ్ట్స్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించారు. కాలు తెగిపోయిన ఓ కప్పతో వారు జరిపిన ప్రయోగంలో విజయం సాధించారు. ఇందుకు వారు ఐదు ఔషధాల మిశ్రమాన్ని వినియోగించారు. ఓ చిన్న సిలికాన్ తిత్తిలో ఆ మిశ్రమాన్ని పోసి కప్ప తెగిన కాలికి తగిలించారు. కొన్నాళ్ల తర్వాత చూస్తే కప్ప కాలు పెరిగినట్టు కనిపించింది. ‘మేము ఎంచుకున్న ఔషధాలు అనుకున్న ఫలితాలు సాధించడం సంతోషం కలిగించింది’ అని అధ్యయన బృందం నివేదికను రూపొందించిన నిరోషా మురుగున్ చెప్పారు. జంతువులలో నిద్రాణంగా ఉండే పునరుద్ధరణ సామర్థ్యాన్ని అవి తట్టిలేపాయని అన్నారు. తదుపరి దశలో క్షీరదాలపై ప్రయోగాలు చేయనున్నట్టు తెలిపారు. అంతిమంగా మానవులకు ఉపయోగకరమైన రీతిలో అభివృద్ధి చేస్తామన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Frogs
- Washington
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

