Prigozhin | మా సైన్యానికి శిక్షణనివ్వండి.. వాగ్నర్ అధినేత ప్రిగోజిన్‌ను కోరిన బెలారస్ అధ్యక్షుడు
సొంత దేశం రష్యాపైనే తిరుగుబాటు చేసి సంచలనం సృష్టించిన ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్‌నకు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ దేశ సైన్యానికి శిక్షణ ఇవ్వాలని వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్‌ను కోరారు.
Prigozhin | మిన్స్, జూలై 2: సొంత దేశం రష్యాపైనే తిరుగుబాటు చేసి సంచలనం సృష్టించిన ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్‌నకు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ దేశ సైన్యానికి శిక్షణ ఇవ్వాలని వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్‌ను కోరారు. ‘దురదృష్టవశాత్తూ వాళ్లు (వాగ్నర్ కిరాయి సైనికులు) ఇక్కడ (బెలారస్లో) లేరు. ఒకవేళ వాగ్నర్ సైనిక కమాండర్లు యుద్ధభూమిలో తమ అనుభవాన్ని మాకు నేర్పిస్తామంటే తప్పకుండా స్వాగతిస్తాం’ అని లుకషెంకో చెప్పినట్టు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ బెల్టా తెలిపింది.
ప్రపంచమంతా పుతిన్‌ను చంపాలనుకొంటున్నది: జెలెన్ స్కీ
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను చంపే ందుకు యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నన్ను చంపేందుకు రష్యా ఒక్కటే ప్రయత్నిస్తున్నది. కానీ, రష్యా అధ్యక్షుడిని చంపేందుకు ప్రపంచమే ఎదురుచూస్తున్నది. నాకన్నా పుతిన్‌కే ఎక్కువ ప్రాణాపాయం ఉన్నది’ అని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

