BP Checkup | మీరు బీపీని ఎలా చెక్ చేయించుకుంటారు.. నిటారుగా కూర్చొనే కదా! అయితే ఈసారి ఇలా ట్రై చేయండి
మీరు బీపీని ఎలా చెక్ చేయించుకుంటారు? నిటారుగా కూర్చొనే కదా! అయితే ఈసారి నడుము వాల్చి (పడుకొని) చెక్ చేయించుకోండి. తేడా మీకే తెలుస్తుంది. ఈ రెండు విధానాల్లో ఒకే వ్యక్తి బీపీ చెక్ చేసి చూడగా.. అందులో వ్యత్యాసం ఉన్నట్టు అమెరికా పరిశోధకులు వెల్లడించారు. అందులోనూ పడుకున్నప్పుడు బీపీ చెక్ చేయించుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నట్టు వారు తెలిపారు. హృదయ రోగాలు ముందస్తుగా తెలుసుకోవచ్చని పరిశోధకులు చెప్పారు.
- కూర్చొని కంటే పడుకొని చెక్ చేయించుకోవడం మేలు
- హృదయ సంబంధిత రోగాలు ముందే తెలిసే అవకాశం!
- హార్వర్డ్ పరిశోధకుల అధ్యయనం వెల్లడి
BP Checkup | న్యూయార్క్, సెప్టెంబర్ 10: మీరు బీపీని ఎలా చెక్ చేయించుకుంటారు? నిటారుగా కూర్చొనే కదా! అయితే ఈసారి నడుము వాల్చి (పడుకొని) చెక్ చేయించుకోండి. తేడా మీకే తెలుస్తుంది. ఈ రెండు విధానాల్లో ఒకే వ్యక్తి బీపీ చెక్ చేసి చూడగా.. అందులో వ్యత్యాసం ఉన్నట్టు అమెరికా పరిశోధకులు వెల్లడించారు. అందులోనూ పడుకున్నప్పుడు బీపీ చెక్ చేయించుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నట్టు వారు తెలిపారు. హృదయ రోగాలు ముందస్తుగా తెలుసుకోవచ్చని పరిశోధకులు చెప్పారు. ఈ మేరకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి కొత్త విషయాలను వెల్లడించారు. పరిశోధన ఫలితాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ హైపర్టెన్షన్ సైంటిఫిక్ సెషన్స్-2023లో సమర్పించారు.
అకాల మరణాలను గుర్తించవచ్చు..
సుమారు 15 వేల మంది అమెరికన్ల నుంచి సేకరించిన డాటాను 30 ఏండ్ల పాటు విశ్లేషించి పరిశోధకులు ఈ విషయాలను వెల్లడించారు. ఈ డాటా ఆధారంగా 16 శాతం మంది కూర్చొన్న సమయంలో వారి బీపీ సాధారణంగానే (130/80 ఎంఎం హెచ్జీ కంటే తక్కువ) నమోదైంది. అదే సమయంలో పడుకొన్నప్పుడు చూడగా వారిలో హైబీపీ కనిపించింది. 74 శాతం మందిలో కూర్చున్నప్పుడు, పడుకొన్నప్పుడు కూడా హైబీపీ కనిపించగా.. వారు భవిష్యత్తులో 1.6 రెట్లు గుండె వైఫల్యానికి గురయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని పరిశోధకులు గుర్తించారు.
అదే సమయంలో 1.86 రెట్లు గుండెపోటు, 1.43 రెట్లు అకాల మరణం, 2.18 రెట్లు హృదయ సంబంధిత రోగాల బారిన పడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని పరిశోధకులు తేల్చారు. అదే సమయంలో పడుకొన్నప్పుడు మాత్రమే హైబీపీ కనిపించిన వారు సైతం ఇవే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని గుర్తించారు. అందుకే పడుకొని కూడా బీపీ చెక్ చేయించుకుంటే హృదయ రోగాలను ముందస్తుగానే గుర్తించే అవకాశం ఉందని పరిశోధనలకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ డూక్ ఎం గియావో తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

