బ్యాంకాక్: థాయిలాండ్ ప్రభుత్వం తమ దేశ పౌరులకు ఉచితంగా కండోమ్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రానున్న వాలెంటైన్స్ డేను పురస్కరించుకొని సురక్షిత శృంగారం, లైంగిక సంక్రమణ వ్యాధులు (ఎస్టీడీ), టీనేజ్‌లో గర్భధారణ నివారణకు 9.5 కోట్ల కండోమ్‌లను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు ఒక అధికారి తెలిపారు.
నాలుగు సైజుల్లో లభించే కండోమ్‌లు ఫార్మసీలు, దవాఖానల ప్రైమరీ కేర్ యూనిట్లలో అందుబాటులో ఉంటాయి. ఏడాది పాటు వీటిని ఉచితంగా పొందవచ్చు.