‘రివెంజ్ పోర్న్’ కేసులో 10 వేల కోట్ల పరిహారం
ఓ ‘రివెంజ్ పోర్న్' కేసులో అమెరికాలోని టెక్సాస్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాధిత మహిళకు పరిహారం కింద 1.2 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.10 వేల కోట్లు) చెల్లించాలని తాజాగా ఆదేశాలు జారీచేసింది.
- అమెరికా కోర్టు సంచలన తీర్పు
వాషింగ్టన్: ఓ ‘రివెంజ్ పోర్న్’ కేసులో అమెరికాలోని టెక్సాస్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాధిత మహిళకు పరిహారం కింద 1.2 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.10 వేల కోట్లు) చెల్లించాలని తాజాగా ఆదేశాలు జారీచేసింది. కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం.. డీఎల్‌గా పేర్కొన్న బాధిత మహిళ.. తమ మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై 2022లో వేధింపుల కేసు వేసింది. బ్రేకప్ తర్వాత అతను తనను మానసికంగా, లైంగికంగా వేధించాడని ఆరోపించారు. 2016 నుంచి డేటింగ్లో ఉన్న వారి మధ్య 2021లో బ్రేకప్ అయింది.
దీని తర్వాత అతను ప్రతీకారంగా తనకు చెందిన వ్యక్తిగత, సన్నిహితంగా మెగిలే ఫొటోలను సోషల్ మీడియా మాధ్యమాలతోపాటు అడల్ట్ వెబ్సైట్లలో పోస్టు చేశాడని బాధిత మహిళ ఆరోపించారు. ఆ లింకులను తన స్నేహితులు, కుటుంబసభ్యులకు పంపేవాడని పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మానసిక వేధింపులకు 20 కోట్ల డాలర్లు, నష్టపరిహారం కింద 100 కోట్ల డాలర్లు చెల్లించాలని మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను ఆదేశించింది. వాస్తవానికి బాధితురాలి తరపు న్యాయవాదులు 10 కోట్ల డాలర్ల పరిహారం ఇప్పించాలని కోరారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం.. పోలీసుల దాడుల్లో విద్యార్థి నేతలు గాయపడ్డారని ఆరోపణ
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

