నారా: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను కాల్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను నారా సిటీకి చెందినవాడే. వయసు 41 ఏళ్లు. పేరు తెత్సుయా యమగామి. కాల్పులు జరిగిన తర్వాత అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. కాల్పులు జరిపి పరుగులు తీస్తున్న సమయంలో సెక్యూర్టీ అధికారులు పరుగులు తీసి యమగామిని అదుపులోకి తీసుకున్నారు. హోమ్మేడ్ ఫైర్ఆర్మ్ను వాడినట్లు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తి జపాన్లోని మారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్లో పని చేశాడు. మారీటైమ్ ఫోర్స్ ఆ దేశ నేవీకి సమానంగా విధులు నిర్వర్తిస్తుంది.