ఏఐతో ఇక ఉద్యోగాలు ఐచ్ఛికమే
కృత్రిమ మేధ(ఏఐ)పై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివాటెక్ 2024లో సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తున్నందున ఇక భవిష్యత్తులో ఉద్యోగాలు కేవలం ఐచ్ఛికంగా మారిపోతాయని పేర్కొన్నారు.
- అన్ని పనులూ ఏఐ, రోబోలు చేసేస్తాయి..
- టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అంచనా
పారిస్, మే 24: కృత్రిమ మేధ(ఏఐ)పై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివాటెక్ 2024లో సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తున్నందున ఇక భవిష్యత్తులో ఉద్యోగాలు కేవలం ఐచ్ఛికంగా మారిపోతాయని పేర్కొన్నారు. ఎవరైనా వ్యక్తులు ఉద్యోగాలను అలవాటుగా చేయాలనుకుంటే చేయవచ్చని, ఒకవేళ ఉద్యోగాలు చేయకపోయినా ఏఐ, రోబోలే మనకు కావాల్సిన అన్ని వస్తువులు, సేవలను అందిస్తాయని ఆయన అంచనా వేశారు. ఏఐతో మానవాళికి మేలు జరగాలంటే ఏఐ టూల్స్ నిజాలు మాత్రమే చెప్పేలా సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
డీడీ కిసాన్‌లో ఏఐ యాంకర్లు
దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రభుత్వ టీవీ చానెల్లో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత న్యూస్ యాంకర్లు రంగ ప్రవేశం చేయనున్నారు. రైతుల కోసం ప్రారంభించిన డీడీ కిసాన్ చానెల్‌కు తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో దూరదర్శన్ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ కృత్రిమ మేధ ఆధారిత న్యూస్ యాంకర్లకు ఏఐ క్రిష్, ఏఐ భూమి అని పేర్లు పెట్టారు. ఈనెల 26 నుంచి వీటి చేత వార్తలు చదివిస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

