Terrifying Video: లోయలోకి దూసుకెళ్లిన కారు.. తృటిలో జంప్ చేసిన మహిళ

బీజింగ్: ఒక కారు కొండ అంచు నుంచి లోయలోకి దూసుకెళ్లింది. అందులోని ఒక మహిళ తృటిలో జంప్ చేసింది. కాగా, కారు లోపలే ఉన్న మరో మహిళ కూడా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. అయితే ఆమె తీవ్రంగా గాయపడింది. ఒళ్లు జలదరింపజేసే ఈ ఘటన చైనాలో జరిగింది. ఒక కుటుంబం జిన్జియాంగ్లోని కొండ ప్రాంత అందాలను చూసేందుకు దుకు హైవే పక్కగా కారును నిలిపింది. ఆ కొండ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా.
కాగా, కారు నుంచి దిగిన ఒక వ్యక్తి డ్రింక్ తాగుతున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి కారు కొండ అంచు నుంచి లోయలోకి జారసాగింది. అప్రమత్తమైన ఆ వ్యక్తి కారును నిలుపేందుకు ప్రయత్నిస్తూ వెనుక డోర్ తీశాడు. దీంతో అందులో ఉన్న మహిళ తృటిలో కారు నుంచి బయటకు జంప్ చేసింది. అయితే కారు ముందు సీటులో కూర్చొన్న మరో మహిళ సీటు బెల్ట్ పెట్టుకోవడంతో వెంటనే బయటకు రాలేకపోయింది.
ఇంతలో అందరూ చూస్తుండగా ఆ కారు కొండ అంచు నుంచి లోయలోకి దూసుకెళ్లింది. అదృష్టం బాగుండి కారులో ఉన్న మహిళ ప్రాణాలతో బయటపడింది. అయితే ఆమె నడుంకు గాయమైంది. ఒళ్లు జలదరింపజేసే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కాగా, కారు ఉన్నట్టుండి కదలడానికి కారణం ఏమిటన్నది అంతుపట్టలేదు. హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ లేదా కేబుల్ కట్ అయి ఉంటుందని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

