కాబూల్: విద్యా హక్కు కోసం నిరసన చేస్తున్న ఆఫ్ఘనిస్థాన్ మహిళలను తాలిబన్ అధికారి కొరడాతో కొట్టాడు. ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. గత వారం బురఖా ధరించనందుకు కొందరు విద్యార్థినులను బదక్షన్ విశ్వవిద్యాలయంలోకి అనుమతించలేదు. దీంతో తమ విద్యా హక్కు కోసం డిమాండ్ చేసిన యువతులు ఆ యూనివర్సిటీ గేట్ వద్ద నిరసనకు దిగారు. తమను లోపలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న తాలిబన్ అధికారి నిరసన చేస్తున్న యువతులను కొరడాతో కొట్టాడు. దీంతో వారు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, గత ఏడాది ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సైన్యం వైదొలగుతున్న తరుణంలో తాలిబన్లు మెరుపువేగంతో రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మహిళలపై కఠిన ఆంక్షలు విధించారు. చదువు, ఉద్యోగం హక్కులను హరించారు. దీంతో తమ హక్కుల కోసం ఆఫ్ఘన్ మహిళలు గళమెత్తుతున్నారు.
طالبان در بدخشان، دختران دانشجو را به بهانه رعایت نکردن حجاب طالبانی لتوکوب کردند. pic.twitter.com/886v0zaSHi
— Mukhtar wafayee مختار وفایی (@Mukhtarwafayee) October 30, 2022