Afghanistan | స్మార్ట్ఫోన్లపై తాలిబన్ల నిషేధం.. ప్రభుత్వ అధికారులు వాడితే కఠిన చర్యలు.. వందల ఫోన్లు ధ్వంసం
Afghanistan : ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వానికి సంబంధించి తాలిబన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ప్రభుత్వ అధికారులు స్మార్ట్ఫోన్లు వాడకుండా నిషేధం విధించారు. అంతేకాదు.. అధికారులు స్మార్ట్ఫోన్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, వారివద్ద ఉన్న స్మార్ట్ఫోన్లను తీసుకుని, అన్నింటినీ కలిపి బహిరంగంగా ధ్వంసం చేశారు.
Afghanistan : ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వానికి సంబంధించి తాలిబన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ప్రభుత్వ అధికారులు స్మార్ట్ఫోన్లు వాడకుండా నిషేధం విధించారు. అంతేకాదు.. అధికారులు స్మార్ట్ఫోన్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, వారివద్ద ఉన్న స్మార్ట్ఫోన్లను తీసుకుని, అన్నింటినీ కలిపి బహిరంగంగా ధ్వంసం చేశారు. ఈ అంశంపై తాలిబన్ మిలిటరీ కోర్టులు అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి.
ఉన్నతాధికారుల నుంచి జనరల్ స్టాఫ్ వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. వీరెవరూ స్మార్ట్ఫోన్లు వాడటానికి వీల్లేదు. సుప్రీం లీడర్కు మాత్రమే ఫోన్ వాడేందుకు అనుమతించారు. ఈ ఆదేశాలు అధికారికంగా వెలువడటం మాత్రమే కొత్త. కానీ, కొంతకాలంగా ఈ ఫోన్ల వాడకంపై అనేక ఆంక్షల్ని తాలిబన్లు అనధికారికంగా అమలు చేస్తున్నారు. తాజా ఆదేశాల ప్రకారం ఎవరైనా అధికారి ఫోన్ వాడుతూ పట్టుబడితే ఆ ఫోన్ను వెంటనే ధ్వంసం చేస్తారు. అలాగే, కోర్టు నియమాలకు అనుగుణంగా, షరియా చట్టాలకు అనుగుణంగా శిక్షలు విధిస్తారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే అధికారుల వద్ద ఉన్న ఫోన్లను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. వందలాది ఫోన్లను ఒకేచోట చేర్చి ధ్వంసం చేశారు. ఫోన్లు వాడటం వల్ల కొన్ని కీలక డాక్యుమెంట్లు లీక్ కావడం, ఉత్పత్తి తగ్గిపోవడం, పనులు మందగించడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అధికారులు ఫోన్లు వాడటం వల్ల సున్నితమైన సమాచారం లీకవుతోందని తాలిబన్లు గుర్తించారు. కొందరు అధికారులు ఫోన్లు వాడుతూ పని చేయడం లేదు. అలాగే, మీటింగ్ జరిగేటప్పుడు కూడా ఫోన్లకే అతుక్కుపోతున్నారు. కొన్ని అంశాలపై నిర్ణయం తీసుకున్నప్పుడు సుప్రీం లీడర్ సంతకం చేయకముందే దానికి సంబంధించిన వివరాలు ప్రజలకు చేరిపోతున్నాయి. ఇలాంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేసిన తాలిబన్లు తాజాగా అధికారికంగా ఫోన్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- afghanistan
- Herat
- hijab
- smartphones
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

