న్యూయార్క్ : అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన ‘సోత్బీస్’ వేలం కేంద్రంలో ‘గస్’ అనే టైరన్నో సారస్ రెక్స్ డైనోసార్ అస్థిపంజరం ఏకంగా 50.01 లక్షల డాలర్లు(సుమారు రూ.420 కోట్లు)కు అమ్ముడయ్యింది. 10 నిమిషాల పాటు ఏడుగురు బిడ్డర్ల మధ్య జరిగిన వేలంలో ఈ డైనోసార్ శిలాజం రికార్డు స్థాయి ధర పలకడం విశేషం.
183 శిలాజ ఎముకలతో కూడిన ఈ ‘గస్’ అస్థిపంజరం ప్రపంచంలోనే అత్యంత సంపూర్ణమైన టీ రెక్స్ శిలాజాలలో ఒకటి. ఇది సుమారు 63 శాతం వరకూ సంపూర్ణంగా ఉంది. ఈ డైనోసార్ శిలాజం 2021లో అమెరికాలోని సౌత్ డకోటాలోని ఒక పశువుల క్షేత్రంలో బయటపడింది. ఈ జీవి సుమారు 72 నుంచి 66 మిలియన్ ఏళ్ల క్రితం నివసించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.