Same sex Marriage : స్వలింగ వివాహానికి రెఫరెండం, స్విట్జర్లాండ్ ప్రజలు గ్రీన్‌సిగ్నల్
Same sex Marriage : స్విట్జర్లాండ్‌లో ఇకపై స్వలింగ వివాహాలు, పౌర వివాహాలు చట్టబద్ధం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన రెఫరెండంలో మూడింట రెండు వంతుల...

(Same sex Marriage) జ్యూరిచ్ : స్విట్జర్లాండ్‌లో ఇకపై స్వలింగ వివాహాలు, పౌర వివాహాలు చట్టబద్ధం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన రెఫరెండంలో మూడింట రెండు వంతుల మెజార్టీతో గ్రీన్‌సిగ్నల్ లభించింది. అలాగే, స్వలింగ జంటలు పిల్లలను దత్తత తీసుకునే హక్కుకు కూడా అక్కడి ప్రజలు పచ్చజెండా ఊపారు. ఈ రెఫరెండం స్విస్ వ్యక్తుల విదేశీ జీవిత భాగస్వాములు స్విట్జర్లాండ్ పౌరసత్వం పొందడాన్ని సులభతరం చేస్తుంది. పెండ్లైన భిన్న లింగ జంటలకే కాకుండా వివాహిత లెస్బియన్ జంటలు కూడా స్పెర్మ్ డొనేషన్ ద్వారా పిల్లలను కలిగి ఉండటానికి రానున్న చట్టం అనుమతించనున్నది. ఇదే సమయంలో 64.9 శాతం స్విస్ ఓటర్లు మూలధన లాభంపై పన్నును ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను తిరస్కరించారు. పశ్చిమ ఐరోపాలో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన చివరి దేశాల్లో ఒకటిగా స్విట్జర్లాండ్ నిలిచింది.
స్విస్ ఫెడరల్ ఛాన్సలరీ అందించిన ఫలితాల ప్రకారం, స్విట్జర్లాండ్ దేశవ్యాప్త ప్రజాభిప్రాయ సేకరణలో 64.1 శాతం మంది ఓటర్లు స్వలింగ వివాహానికి అనుకూలంగా ఓటు వేశారు. స్విస్ న్యాయశాఖ మంత్రి కరిన్ కెల్లర్-సుట్టర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు.
రెఫరెండం రాగానే స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్‌లో స్వలింగ సంపర్కులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి వేడుకలు జరుపుకున్నారు. ఇలా రెఫరెండం రావడం చాలా సంతోషంగా, ఉపశమనంగా ఉన్నదని మ్యారేజ్ ఫర్ ఆల్ సంస్థ జాతీయ కమిటీకి చెందిన ఆంటోనియా హౌస్విర్త్ అన్నారు. స్వలింగ జంటలకు పౌర వివాహం జరిపేందుకు రెఫరెండం రావడం సమానత్వానికి మైలురాయి అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో పేర్కొన్నది. కాగా, స్విస్ పీపుల్స్ పార్టీ (ఎస్వీపీ) నేత, నో టూ మ్యారేజ్ ఫర్ ఆల్ సంస్థ ప్రజాభిప్రాయ కమిటీ సభ్యురాలు మోనికా రూగెగర్ నిరాశకు గురయ్యారు.
ఇవి కూడా చదవండి..
మన్మోహన్ కాకుండా పవార్‌ను ప్రధాని చేస్తే బాగుండేది: రాందాస్ అథవాలే
బ్యాడ్ బ్యాంకుకు లక్ష కోట్ల ఫ్రాడ్ లోన్స్.. ఆర్బీఐ అనుమతికి ఎదురుచూపులు
వార్ మ్యూజియంను సందర్శించిన వెంకయ్యనాయుడు
ఎప్పుడో కొన్న షేర్లకు కోట్ల విలువ.. ఇప్పించాలని సెబీని ఆశ్రయించిన బాబు జార్జ్ వలవి
ఆందోళన చేస్తున్న రైతు మృతి.. గుండెపోటుతో అంటున్న పోలీసులు
సరిహద్దులో క్రియాశీలకంగా చైనా.. మాడ్యులర్ కంటైనర్ల ఏర్పాటు
ఉద్యమమే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఊపిరి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

