Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలిన ఘటనలో 38 మంది గాయపడ్డారు. ఈ సంఘటన దక్షిణ కొరియాలోని డేగూ సిటీ మాల్లో జరిగింది. ప్రస్తుతం 9 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
సియోల్ : దక్షిణకొరియాలోని ఓ షాపింగ్ మాల్(Supermarket)లో పైకప్పు కూలడంతో సుమారు 38 మంది గాయపడ్డారు. ఈ ఘటన డేగూ సిటీలో జరిగింది. ప్లాస్టర్ సీలింగ్ కూలినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో చిక్కుకున్న 66 మందిని సురక్షితంగా తరలించినట్లు డేగూ అగ్నిమాపక శాఖ పేర్కొన్నది. ఇవాళ ఉదయం 10.16 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. వివిధ ఆస్పత్రుల్లో కొందరు చికిత్స పొందుతున్నారు. గాయపడ్డవారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని, కానీ తీవ్రంగా గాయపడ్డ వారు ఎవరూ లేరని అధికారులు చెప్పారు. నాలుగు అంతస్తుల బిల్డింగ్‌లో రెండో అంతస్తు పైకప్పు ప్లాస్టరింగ్ కూలిందని ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ యూన్ జాంగ్ మి తెలిపారు. అయితే దేని వల్ల పైకప్పు కూలిందో తేల్చలేదు. ఈ ఘటనలో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మయుంగ్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

