సుదర్శన్ పట్నాయక్‌కు యూకే శాండ్ మాస్టర్ అవార్డ్
ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇసుకతో శిల్ప కళను ప్రదర్శించటంలో ఆయన చేసిన కృషికి గాను ‘ద ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్'ను అందుకున్నారు.
లండన్: ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇసుకతో శిల్ప కళను ప్రదర్శించటంలో ఆయన చేసిన కృషికి గాను ‘ద ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్’ను అందుకున్నారు. శనివారం నైరుతి ఇంగ్లండ్‌లోని వేమౌత్‌లో మొదలైన 2025 ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో సుదర్శన్ పట్నాయక్‌కు నగర మేయర్ జాన్ ఓరెల్ మెడల్, అవార్డును అందజేశారు. దీనికంటే ముందు వేడుకలో పాల్గొన్న సుదర్శన్ పట్నాయక్ ‘ప్రపంచ శాంతి’ అనే సందేశంతో 10 అడుగుల ఎత్తుతో వినాయకుడి సైకత శిల్పాన్ని ఆవిష్కరించారు.
ప్రపంచ ప్రఖ్యాత బ్రిటీష్ సైకత శిల్పి ఫ్రెడ్ డారింగ్టన్ పేరుమీదుగా బ్రిటన్ ఏటా ఈ పురస్కారాలను అందజేస్తున్నది. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ కళాకారుడిగా సుదర్శన్ పట్నాయక్ రికార్డ్ సృష్టించారు. ఈసారి బ్రిటన్‌లో జరిగిన స్యాండ్ ఫెస్టివల్లో అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన 65మంది సైకత శిల్ప కళాకారులు పాల్గొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

