టెక్సాస్ స్కూల్లో మరోసారి తుపాకీ కలకలం..
Texas | అమెరికాలోని టెక్సాస్ (Texas) స్కూల్లో మరోసారి తుపాకీ కలకలం సృష్టించింది. ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో 18 ఏండ్ల యువకుడు మారణహోమం సృష్టించి 24 గంటలు గడువక ముందే మరొకరు తుపాకీతో పట్టుబడ్డాడు.
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ (Texas) స్కూల్లో మరోసారి తుపాకీ కలకలం సృష్టించింది. ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో 18 ఏండ్ల యువకుడు మారణహోమం సృష్టించి 24 గంటలు గడువక ముందే మరొకరు తుపాకీతో పట్టుబడ్డాడు. టెక్సాస్‌లోని రిచర్డ్సన్ స్కూల్లో ఓ హైస్కూల్ విద్యార్థి తుపాకీతో తిరుగుతుండగా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అయితే అతడు ఎలాంటి ఘాతుకానికి పాల్పడక ముందే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో సాల్వడోర్ రామోస్ అనే 18 ఏండ్ల యువకుడు ఉన్మాదానికి పాల్పడిన విషయం తెలిసిందే. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా తుపాకీ కొనుగోలు చేసిన రామోస్.. ముందు తన నానమ్మను కాల్చి చంపాడు. అనంతరం రాబ్ స్కూల్‌కు వెళ్లి అక్కడ విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 21 మంది మరణించారు. వారిలో 19 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే పోలీసుల కాల్పుల్లో అతడు హతమైన విషయం విధితమే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

