సిడ్నీ, జనవరి 27: పాలపుంత గెలాక్సీలో ఓ వింత వస్తువును (ఆబ్జెక్ట్) ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ఆ వస్తువు నుంచి ప్రతి 18.18 నిమిషాలకు ఒక రేడియో కాంతి పుంజం విడుదల అవుతున్నట్టు నటాషా హర్లీ వాకర్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఇలాంటి వస్తువులు విశ్వంలో ఉండవచ్చని థియరీల్లోనే ఉన్నదని, అయితే ఇప్పటివరకూ ఈ తరహా వస్తువులను ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ఇదో తెల్లని మరుగుజ్జు నక్షత్రం లేదా అల్ట్రా లాంగ్ పీరియడ్ మాగ్నెటార్ కావొచ్చని అభిప్రాయపడ్డారు. దీనిపై మరింత లోతుగా పరిశోధన చేస్తున్నట్టు వెల్లడించారు.