Karunatilaka wins Booker Prize: బుకర్ ప్రైజ్ గెలిచిన శ్రీలంక రచయిత కరుణతిలక
Karunatilaka wins Booker Prize:శ్రీలంక రచయిత షెహన్ కరుణతిలక 2022 సంవత్సరానికి బూకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ద సెవన్ మూన్స్ ఆఫ్ మాలీ అల్మేదా అన్న నవలకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. మానవత్వ లోతుల గురించి ఆ న
లండన్: శ్రీలంక రచయిత షెహన్ కరుణతిలక 2022 సంవత్సరానికి బుకర్ ప్రైజ్(Karunatilaka wins Booker Prize) గెలుచుకున్నారు. ద సెవన్ మూన్స్ ఆఫ్ మాలీ అల్మేదా అన్న నవలకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. మానవత్వ లోతుల గురించి ఆ నవలో చాలా విపులంగా రాసినట్లు జడ్జిలు తెలిపారు. కరుణతిలక వయసు 47 ఏళ్లు. బూకర్ ప్రైజ్ గెలచిన రెండవ శ్రీలంక రచయిత ఆయన. 1992లో ఇంగ్లీస్ పేషెంట్ నవల రాసిన లంక రచయిత మైఖేల్ ఒండాజే ఈ అవార్డు సొంతం చేసుకున్నారు.
ఓ ఫోటోగ్రాఫర్ కథే ద సెవన్ మూన్స్ ఆఫ్ మాలీ అల్మేదా. 1990 దశకంలో శ్రీలంకలో జరిగిన యుద్ధ నేరాల గురించి ఈ నవలలోని పాత్రలతో చెప్పించారు. జీవితం, మరణానికి సంబంధించిన సత్యాలను చాలా సాహసోపేతంగా రచయిత తన నవలలో రాసినట్లు జడ్జిలు తెలిపారు. యుద్ధ నేరాలకు చెందిన ఫోటోలతో ఆ దేశాన్ని మెల్కోల్పిన తీరు ఆ కథలో ఉన్నట్లు బూకర్ కమిటీ అభిప్రాయపడింది. శ్రీలంకలో సాగిన అకృత్యాలను సెటైర్ రూపంలోనూ ఆ నవలలో చిత్రీకరించారు.
కరుణతిలక 1975లో గాలేలో జన్మించారు. కొలంబోలో పెరిగారాయన. నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితిపై జోకులు వెయ్యడం శ్రీలంకన్ల ప్రత్యేకమని కరుణతిలక అన్నారు. మరణం తర్వాత జరిగిన సంఘటనలతో ఫోటోగ్రాఫర్ మాలీ అల్మేదా ఎలా యుద్ధ నేరాలను బయటపెడుతారన్న విషయాన్ని రచయిత చాలా థ్రిల్లింగ్ చెప్పినట్లు బూకర్ కమిటీ జడ్జిలు తెలిపారు. 2011లో ఆయన రాసిన తొలి నవల చైనామ్యాన్కు కామన్వెల్త్ ప్రైజ్ వచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

