నేడే నింగిలోకి స్పేస్ఎక్స్ ‘ఇన్స్పిరేషన్ 4’

వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కానున్నది. రోదసి ప్రయోగాల్లో ఎలాంటి అనుభవంలేని నలుగురు పౌరులను ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ఎక్స్’ నింగిలోకి పంపించనున్నది. అమెరికాలోని ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం ఈ ప్రయోగం చేపట్టనున్నారు. స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్9 రాకెట్… వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్‌ను భూకక్ష్యలోకి తరలించనున్నది. ‘ఇన్స్పిరేషన్ 4’ పేరుతో చేపట్టనున్న ఈ ప్రయోగంలో భాగంగా నలుగురిని అంతరిక్ష విహారానికి తీసుకెళ్లనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్), హబుల్ టెలిస్కోప్‌ను దాటుకొని వీరి పర్యటన కొనసాగనున్నది. మూడు రోజుల అనంతరం వ్యోమగాములు తిరిగి భూమి మీదకు చేరుకుంటారు. ఈ ప్రయోగ ఖర్చులన్నింటినీ అమెరికా కోటీశ్వరుడు, ‘షిఫ్ట్4పేమెంట్స్’ కంపెనీ సీఈవో జేర్డ్ ఐసాక్‌మాన్ భరిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- inspiration
- Space X
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

