బెర్ని, అక్టోబర్ 27: సౌరశక్తి వినియోగంలో స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు సరికొత్త విజయం సాధించారు. ఈకోల్ పాలిటెక్నిక్ సంస్థ పరిశోధకులు పారదర్శక సోలార్ ప్యానెల్స్ రూపొందించారు. వీటిని చూరు మీద కాకుండా మామూలు కిటికీ అద్దాలకు, గ్రీన్హౌస్ అద్దాలకు అమర్చుకోవచ్చని తెలిపారు.
పైగా ప్రింటింగ్ ప్రక్రియ ద్వారా భారీ స్థాయిలో చవకగా ఉత్పత్తి చేయడం చాలా సులభమని అంటున్నారు. అయితే సాంప్రదాయిక సోలార్ ప్యానెల్స్‌తో పోలిస్తే ఇవి సుమారు 30 శాతం విద్యుత్తును మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. ఈ కొత్తరకం పారదర్శక ప్యానెల్స్‌ను మొబైల్, కంప్యూటర్ స్క్రీన్లకు కూడా అమర్చవచ్చని తెలిపారు. శాస్త్ర విషయాల జర్నల్ ‘నేచర్’ తాజా సంచికలో ఈ నూతన ఆవిష్కరణ తాలూకు విశేషాలను ప్రచురించారు.