లండన్: బ్రిటన్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం(Skyscraper Flames) జరిగింది. అయితే టవర్‌పై ఉన్న రూఫ్ మీద ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. భారీ స్థాయిలో మంటలు, దట్టమైన నల్లటి పొగ చిమ్ముతుంటే, టవర్‌పై ఉన్న ఆ వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. రీడింగ్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఓ బిల్డింగ్‌లో ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న ఆ బిల్డింగ్‌పై చిక్కుకున్న వ్యక్తిని పొగ, నిప్పు కమ్మేసుకున్నది. అయితే అగ్నిమాపక సిబ్బంది ఓ మెటల్ కేజ్‌తో అతన్ని రక్షించారు. క్షణం క్షణం ఎగిసిపడుతున్న మంటల మధ్యే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.
Fire in Reading. Rescue of trapped person. pic.twitter.com/DAivXldypy
— Chris Lauder (@ChrLauder) November 23, 2023