సింగపూర్, సెప్టెంబర్ 8: ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందే ప్రభుత్వాధినేతగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ రికార్డు సృష్టించారు. ఇటీవలే 64 శాతం పెరగడంతో ఆయన వార్షిక వేతనం 2.2 మిలియన్ డాలర్ల నుంచి 3.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.26.9 కోట్లు)కు చేరుకుంది. సమర్థులైన వ్యక్తులు రాజకీయాల్లోకి రావడానికి వెనుకాడకుండా ఉండేలా చూసేందుకు, రాజకీయ పదవులకు ఇచ్చే వేతనాలు తగినంత పోటీతత్వంతో కూడినవిగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది.