Silvio Berlusconi: 33 ఏండ్ల గర్ల్‌ఫ్రెండ్‌కు రూ. 900 కోట్ల ఆస్తి గిఫ్ట్.. ఇటలీ మాజీ ప్రధాని సంచలన నిర్ణయం
Silvio Berlusconi: 33 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌కు 900 కోట్లు ఇచ్చాడు బెర్లుస్కోనీ. ఇటలీ మాజీ ప్రధాని ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆ బిలియనీర్ తన వీలునామాలో గర్ల్‌ఫ్రెండ్‌కు భారీ షేర్ ఇచ్చేశాడు. ఐదుగురు పిల్లల ముందే ఆ వీలునామా చదివారు. సోదరుడితో పాటు మరో పార్టీ నేతకు కూడా వంద మిలియన్ల యూరోలు ఇచ్చాడు.
రోమ్: ఇటలీ మాజీ ప్రధాని, బిలియనీర్ సిల్వియో బెర్లుస్కోనీ(Silvio Berlusconi) ఇటీవల 86 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. మూడుసార్లు ప్రధానిగా చేసిన ఆయన తన వీలునామాలో 33 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్ మార్టా ఫాసినాకు 100 మిలియన్ల యూరోలు కేటాయిస్తున్నట్లు రాశారు. అంటే ఆమెకు సుమారు 900 కోట్లు ఇచ్చేశాడన్నమాట. మాజీ ప్రధాని బెర్లుస్కోనీ మొత్తం ఆస్తి 6 బిలియన్ల యూరోలు.
ఫోర్జా ఇటాలియా పార్టీలో డిప్యూటీగా మార్టా ఫాసినా కొనసాగుతున్నారు. 2020 మార్చి నుంచి ఆమె బెర్లుస్కోనీతో రిలేషన్లో ఉన్నారు. నిజానికి ఆమెను బెర్లుస్కోనీ అధికారికంగా పెళ్లాడలేదు. కానీ మరణం సమయంలో ఆమెను భార్యగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇటలీ దిగువ సభలో మార్టా ఫాసినా సభ్యురాలిగా ఉన్నారు.
మరో వైపు బెర్లుస్కోనీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఇక నుంచి ఆయన ఇద్దరు పిల్లలు కంట్రోల్ చేయనున్నారు. మారినా, పీయర్ సిల్వియోలు .. ఫిన్ఇన్వెస్ట్లో 53 శాతం వాటాను సొంతం చేసుకోనున్నారు. తన సోదరుడు పావలోకు 100 మిలియన్ల యూరోలు కేటాయించారు బెర్లుస్కోనీ. ఇక తన పార్టీకి చెందిన మాజీ సేనేటర్ మార్సిలో డెల్ఉట్రికి 30 యూరోలు వాటా ఇచ్చారు.
బెర్లుస్కోనీ జూన్ 12వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. అయితే తన ఐదుగురు పిల్లల ముందే ఆయన రాసిన వీలునామాను చదవి వినిపించారు. స్టాక్స్ అన్నీ పిల్లలకు సమానంగా చెందాలని రాశారు. ఇటలీలో అత్యధిక కాలం ప్రధానిగా చేసిన రికార్డు ఆయన పేరిట ఉంది. కానీ బుంగా బుంగా పార్టీలతో ఆయన వివాదాస్పద నేతగా మారారు. ఎన్నో కుంభకోణాల్లో పాత్ర ఉన్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

