Shooting in Copenhagen | కొపెన్హగ్ మాల్లో కాల్పులు.. పలువురికి గాయాలు!
Shooting in Copenhagen | డెన్మార్క్‌లోని కొపెన్‌హగెన్‌లో మాల్లో ఆదివారం జరిగిన కాల్పుల్లో పలువురికి గాయాలయ్యాయి.
Shooting in Copenhagen | డెన్మార్క్‌లోని కొపెన్హగ్ షాపింగ్‌మాల్‌లో ఆదివారం కాల్పులు జరిగాయి. అమాజిర్ జిల్లాలోని సిటీ సెంటర్, విమానాశ్రయం మధ్య గల ఫీల్డ్స్ మాల్లో ఈ కాల్పుల ఘటన జరిగిందని కొపెన్హగ్ పోలీసులు తెలిపారు. తాము ఘటనా స్థలంలోనే ఉన్నామని, పలువురు వ్యక్తులకు గాయాలయ్యాయని ట్విట్టర్ వేదికగా కొపెన్హగ్ పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.
తొలి కాల్పులు వినిపించినప్పుడు మాల్ ఎగ్జిట్ ద్వారం వైపు 100 మందికి పైగా పరుగులు తీశారని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ఈ మాల్ లోపల ఉన్న వారు లోపలే వేచి ఉండాలని పోలీసులు సూచించారు. మిగతా వారు ఈ ప్రాంతానికి దూరంగా ఉండాలని హితవు చెప్పారు.
ఈ కాల్పుల ఘటనతో సంబంధం ఉన్న ఒక అనుమానితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫీల్డ్స్ షాపింగ్ మాల్ వద్ద కాల్పుల ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తి వివరాలను ఇప్పటికైతే వెల్లడించలేం అని కొపెన్హగ్ పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Copenhagen
- Denmark
- Shooting
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

