న్యూయార్క్ : అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. నగరంలోని మాంటేరి పార్క్‌లో చైనీయుల న్యూ ఇయర్ ఈవెంట్లో జరిగిన మాస్ షూటింగ్లో పలువురు మరణించారు. కాల్పుల ఘటన సమాచారంతో మాంటేరి పార్క్‌కు చేరుకున్న పోలీసులు సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేశారని లాస్ఏంజెల్స్ టైమ్స్ పేర్కొంది.

చైనా లునార్ న్యూ ఇయర్ వేడుకల్లో కాల్పులు జరిగాయని తెలిపింది. శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. కాగా ఈ ఘటనలో పది మంది మరణించగా పలువురు గాయపడ్డారని సమాచారం.