కాఠ్మాండు: సీరియల్ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్(Charles Sobhraj) ఇవాళ నేపాల్‌లోని సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. జీవితకాల శిక్ష ఎదుర్కొంటున్న శోభరాజ్‌ను రిలీజ్ చేయాలని ఆ దేశ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. శోభరాజ్ ఆరోగ్యం క్షీణించిందని, సత్ప్రవర్తన కారణంగా అతన్ని రిలీజ్ చేయాలని కోర్టు పేర్కొన్నది. 78 ఏళ్ల శోభరాజ్ జైలు నుంచి రిలీజైనట్లు ఇవాళ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొన్నది.
అతనికి పాస్‌పోర్ట్ ఇచ్చిన దేశానికి .. శోభరాజ్‌ను డిపోర్ట్ చేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది. 2003 సెప్టెంబర్‌లో నేపాలీ పోలీసులు శోభరాజ్‌ను అరెస్టు చేశారు. కాసినో రాయల్‌లో ఉన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసియా, యూరోప్‌లో జరిగిన అనేక నేరాల్లో శోభరాజ్ నిందితుడు.
సీరియల్ కిల్లర్ శోభరాజ్‌ను ఫ్రాన్స్‌కు డిపోర్ట్ చేయనున్నారు.