మేఘన్‌కు సెరెనా విలియమ్స్ మద్దతు

న్యూయార్క్: బ్రిటిష్ రాచ కుటుంబంలోనూ వర్ణ వివక్ష ఉన్నదంటూ సంచలన ఆరోపణలు చేసిన మేఘన మార్కెల్‌కు మద్దతుగా నిలిచింది అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్. ఓప్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఈ రెండు గంటల ఇంటర్వ్యూలో ప్రపంచం నివ్వెరపోయే కొన్ని విషయాలను మేఘన్ వెల్లడించింది. తన కొడుకు ఎంత నల్లగా ఉంటాడో అని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో చర్చ జరిగిన సందర్భంతోపాటు తనకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల వరకూ ఎన్నో అంశాలను ఆమె పంచుకుంది. దీనిపై సెరెనా ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. నా నిస్వార్థ స్నేహితురాలకి ఈ విషయంలో తాను పూర్తి మద్దతు తెలుపుతున్నానని సెరెనా ఆ పోస్ట్‌లో స్పష్టం చేసింది.
తన కెరీర్లోనూ ఎన్నోసార్లు వర్ణ వివక్షను ఎదుర్కొన్న సెరెనా.. మేఘన్‌కు అండగా నిలిచింది. ఆఫ్రికన్-అమెరికన్ అయిన మేఘన్ మార్కెల్.. ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకున్న సమయంలో బ్రిటీష్ మీడియా ఆమెతో దారుణంగా వ్యవహరించింది. ఆమెకు వ్యతిరేకంగా ఎన్నో కథనాలు రాసింది. ఇవి చూసే తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు మేఘన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. లింగ వివక్ష, వర్ణ వివక్ష ఎంత దారుణంగా ఉంటాయో నాకు తెలుసు. శరీర రంగు ఆధారంగా మహిళలను తక్కువ చేసి అణిచేయడానికి చూస్తారు. మన పిల్లలకు మాత్రం ఈ పరిస్థితి ఉండకూడదు అని సెరెనా తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

