సోమాలియాలో అమెరికా దాడులు.. ఐఎస్ఐఎస్ సీనియర్ లీడర్ బిలాల్ అల్ సుదానీ హతం
సోమాలియాలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు భారీఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైన్యం దాడిలో ఐసీస్ సీనియర్ నాయకుడు బిలాల్ అల్ సుదానీ హతమయ్యాడు.
వాషింగ్టన్: సోమాలియాలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు భారీఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైన్యం దాడిలో ఐసీస్ సీనియర్ నాయకుడు బిలాల్ అల్ సుదానీ హతమయ్యాడు. ఉత్తర సోమాలియాలోని పర్వత గుహ కాంప్లెక్సులో ఉన్న ఇస్లామిక్ స్టేట్ (ISIS) గ్రూప్ ప్రాంతీయ నాయకుడైన సుదానీని పట్టుకునేందుకు అమెరికన్ పారామిలిటరీ దళాలు యత్నించాయి. ఈ క్రమంలో సైన్యం జరిపిన కాల్పుల్లో సుదానీతోపాటు అతని సహచరులు మరో 10 మంది మంది హతమయ్యారని యూఎస్ సైనికాధికారులు ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో తమ సైనికులెవరూ గాయపడలేదని వెల్లడించారు.
ఈ నెల 22న సోమాలియాలోని గాల్కాడ్ టౌన్ సమీపంలో అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఇస్లామిస్ట్ అల్ శబాబ్కు చెందిన 30 మంది తీవ్రవాదులు చనిపోయారు. అమెరికా రక్షణ విభాగమైన పెంటగాన్ విజ్ఞప్తి మేరకు సోమాలియా మిలిటరీకి యూఎస్ సహాయం అందిస్తున్నది. 2022, మే నుంచి దాదాపు 500 ట్రూపులను సోమాలియాలో మోహరించింది. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సోమాలియా సైనికులకు తగిన శిక్షణ అందించడంతోపాటు వారికి సపోర్ట్‌గా టెర్రరిస్టు కేంద్రాలపై దాడులు నిర్వహిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

