Jaahnavi Kandula: జాహ్నవి కారు ప్రమాదం కేసులో అమెరికా పోలీసుపై వేటు
Jaahnavi Kandula: కందుల జాహ్నవి అమెరికాలోని సియాటిల్‌లో జరిగిన కారు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె మృతికి కారణమైన పోలీసు ఆఫీసర్ డేవ్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని సియాటిల్ పోలీసు చీఫ్ వెల్లడించారు.
లాస్ వెగాస్: 2023 ఫిబ్రవరిలో భారతీయ విద్యార్థిని కందుల జాహ్నవి(Jaahnavi Kandula) .. అమెరికాలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో సియాటిల్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. జాహ్నవిని ఢీకొట్టిన పోలీసు ఆఫీసర్ కెవిన్ డేవ్‌ను విధుల నుంచి తొలగించారు. సియాటిల్‌లో జనవరి 23వ తేదీన వీధిని క్రాస్ చేస్తున్న సమయంలో.. సుమారు 119 కిలోమీటర్ల వేగంతో వస్తున్న కెవిన్ డేవ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. ఆమె 100 ఫీట్ల దూరంలో పడిపోయింది. ఆ ప్రమాదంలో జాహ్నవి ప్రాణాలు కోల్పోయింది.
అయితే ఆ ఘటన పట్ల సియాటిల్ పోలీసు చీఫ్ సూ రాహర్ చర్యలు తీసుకున్నారు. సియాటిల్ పోలీసు శాఖ నుంచి డేవ్‌ను బహిష్కరిస్తున్నట్లు పోలీసులు చీఫ్ తెలిపారు. డేవ్ సుమారు నాలుగు ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్రగ్ ఓవర్డోసు బాధిత వ్యక్తిని కాపాడేందుకు వేగంగా వెళ్తున్న ఆఫీసర్ డేవ్.. ఆ వేగంలోనే రోడ్డు క్రాస్ చేస్తున్న జాహ్నవిని ఢీకొట్టాడు. అనుకోకుండా ప్రమాదం జరిగినా, దాని పర్యవసానాలను ఆమోదించలేమని పోలీసు చీఫ్ తెలిపారు.
పాజటివ్ ఉద్దేశంతో వేగంగా వెళ్తున్నా.. అతని నిర్ణయం వల్ల ఓ ప్రాణం బలైందన్నారు. దీంతో సియాటిల్ పోలీసుశాఖకు చెడ్డ పేరు వచ్చిందన్నారు. జాహ్నవి మృతి పట్ల నవ్వుకుంటూ కామెంట్ చేసిన మరో పోలీసు డేనియల్ ఆడెరర్‌ను కూడా ఫైర్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

