Global Warming | గ్లోబల్ ‘వార్నింగ్’.. పెరుగుతున్న భూతాపం.. మానవాళికి శాపం
పెరుగుతున్న భూతాపం మానవాళిని కబళించే రోజు ఎంతోదూరం లేదంటూ శాస్త్రవేత్తలు అత్యంత తీవ్రమైన హెచ్చరిక జారీచేశారు. ప్రతి దశాబ్దానికి భూమి రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీలు వేడెక్కుతున్నదని తేల్చారు.
Global Warming | న్యూయార్క్: పెరుగుతున్న భూతాపం మానవాళిని కబళించే రోజు ఎంతోదూరం లేదంటూ శాస్త్రవేత్తలు అత్యంత తీవ్రమైన హెచ్చరిక జారీచేశారు. ప్రతి దశాబ్దానికి భూమి రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీలు వేడెక్కుతున్నదని తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా 50 మంది శాస్త్రవేత్తలు భూ ఉష్ణోగ్రతపై అధ్యయనం నిర్వహించారు. మానవ చర్యలు, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం భూతాపానికి కారణమవుతున్నట్టు కనుగొన్నారు.
శిలాజ ఇంధనంతో నడిచే అన్ని మౌలిక సదుపాయాలను కొనసాగిస్తే పారిశ్రామిక కాలంనుంచి భూమి ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పెరిగిపోతుందని, ఇది చాలా ప్రమాదకరమని తేల్చారు. పారిశ్రామిక విప్లవం ముందునాటి సగటుకంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్‌కు మించి ఉష్ణోగ్రతలను పెరుగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకోవాలంటే మునుపెన్నడూ లేనిస్థాయిలో సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. 2035 నాటికి ప్రపంచం తమ గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాల్లో 60 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన లీడ్స్ వర్సిటీ ప్రొఫెసర్ పియర్స్ ఫాస్టర్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

