అమ్‌స్టర్‌డామ్, డిసెంబర్ 12: రెగ్యులర్‌గా నైట్‌షిఫ్ట్ చేస్తున్నవారికి శాస్త్రవేత్తలు బ్యాడ్‌న్యూస్ చెప్పారు. క్రమం తప్పకుండా రాత్రి విధులు నిర్వహిస్తున్న వారు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్టు తేల్చారు. నెదర్లాండ్, బెల్జియం పరిశోధకులు 37,662 మందిపై అధ్యయనం నిర్వహించారు. వారి పని వేళ లు, నిద్రపోయే సమయాలను వయసు, లింగం, విద్యార్హతల ఆధారంగా విశ్లేషించారు. సాధారణ షిఫ్టుల్లో పనిచేసే వారితో పోలిస్తే రెగ్యులర్‌గా, రొటేషన్ పద్ధతిలో రాత్రిషిఫ్టులు చేసేవారు నిద్రలేమి, నిద్ర సంబంధిత శ్వాస రుగ్మతలతో బాధపడుతున్నట్టు తేల్చారు.