ఎడిన్బర్గ్: బొద్దింకలు ఏ మూలలో దాగున్నా వెదికి పట్టుకుని కాల్చేసే లేజర్ షూటర్‌ను స్కాట్లాండ్లోని హెరియట్-వాట్ వర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఎంఎల్ అల్గారిథమ్‌తో పనిచేసే జెస్టన్ నానో కంప్యూటర్ ఆధారంగా దీన్ని ఇల్ధార్ రఖ్మటులిన్ నేతృత్వంలోని పరిశోధక బృందం తయారుచేసింది. ఈ యంత్రంలోని రెండు కెమెరాలు డిజిటల్ సిగ్నల్స్ ఆధారంగా బొద్దింకల చలనాన్ని క్యాప్చర్ చేస్తాయి. ఈ సమాచారాన్ని యంత్రంలోని గాల్వనోమీటర్కు చేరవేస్తాయి. అక్కడినుంచి బొద్దింకలను లక్ష్యంగా చేసుకుని షూట్ చేయాల్సిందిగా లేజర్‌కు ఆదేశాలు వెళ్తాయి. ఈ లేజర్ షూటర్ 1.2 మీటర్ల దూరంలోని బొద్దింకలను చంపుతుంది. ఈ యంత్రం తయారీకి రూ.20 వేల ఖర్చవుతుందని పరిశోధకులు తెలిపారు.