సౌదీలో భారీ బంగారం నిల్వలు
సౌదీ అరేబియాలో భారీ ఎత్తున బంగారం, రాగి నిల్వలు బయటపడ్డాయి. మదీనాలో ఈ గనులు ఉన్నట్టు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. మదీనా ప్రాంతంలోని అబాఅల్హ్రాలో బంగార నిల్వలు, వాదీఅల్మరా పరిధిలోని నాలుగు చోట్ల రాగి నిల్వలు ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని సౌదీ జియొలాజికల్ సర్వే విభాగం ట్విట్టర్లో పేర్కొన్నది.
జెద్దా, సెప్టెంబర్ 24: సౌదీ అరేబియాలో భారీ ఎత్తున బంగారం, రాగి నిల్వలు బయటపడ్డాయి. మదీనాలో ఈ గనులు ఉన్నట్టు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. మదీనా ప్రాంతంలోని అబాఅల్హ్రాలో బంగార నిల్వలు, వాదీఅల్మరా పరిధిలోని నాలుగు చోట్ల రాగి నిల్వలు ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని సౌదీ జియొలాజికల్ సర్వే విభాగం ట్విట్టర్లో పేర్కొన్నది. ఈ నిల్వలు ప్రపంచానికి పెట్టుబడి అవకాశాలను కలిగిస్తున్నాయిని తెలిపింది. స్థానిక, విదేశీ పెట్టుబడులు మొత్తం 53.30 కోట్ల (సుమారు రూ.4747 కోట్లు) దాకా అవసరమని అంచనా వేస్తున్నారు. 4,000 మందికి ఉపాధి కూడా లభిస్తుందని అంటున్నారు. దేశ అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని సౌదీ ప్రభుత్వం భావిస్తున్నది. సౌదీ అరేబియాలో ఖనిజాలు లభించే ప్రదేశాలు 5,300 దాకా ఉన్నాయని సౌదీభౌగోళిక శాస్ర్తవేత్తల సహకరా సంఘం చైర్మన్ ప్రొఫెసర్ అబ్దుల్ అజీజ్ గత జనవరిలో వెల్లడించారు. వాటిల్లో బంగారం, లోహాలు, గృహనిర్మాణానికి పనికివచ్చే పదార్థాలతో పాటుగా విలువైన రాళ్లు, వజ్రాలు ఉన్నట్టు వివరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

