ఈ ట్రెండ్.. అత్యంత భయానకం
కృత్రిమ మేధ సాయంతో రూపొందుతున్న డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భయానకమైందిగా పేర్కొన్నారు.
- డీప్‌ఫేక్‌పై సత్యనాదెళ్ల ఆందోళన
వాషింగ్టన్: కృత్రిమ మేధ సాయంతో రూపొందుతున్న డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భయానకమైందిగా పేర్కొన్నారు. అమెరికాలో ప్రముఖులకు చెందిన డీప్‌ఫేక్ ఫొటోలు, చిత్రాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా అమెరికన్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్‌కు చెందిన డీప్‌ఫేక్ అశ్లీల దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ‘నెట్టింట ఈ ట్రెండ్ అత్యంత భయానకం. టెక్నాలజీ దుర్వినియోగంపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి’ అని ఆయన అన్నారు.
సోమవారం ఎన్బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘టెక్నాలజీ దుర్వినియోగం ప్రమాదకరం, భయంకరమైంది. దీనిని అరికట్టేందుకు వేగంగా స్పందించాల్సిన అవసరముంది. ఆన్లైన్లో సురక్షితమైన సమాచారం ఉండేలా కట్టుదిట్టమైన నిబంధనలు రావాలి. దర్యాప్తు సంస్థలు, టెక్ సంస్థలు కలిసి వస్తే.. డీప్‌ఫేక్ అరికట్టడం పెద్ద విషయం కాదు’ అని సత్యనాదెళ్ల అభిప్రాయపడ్డారు. మైక్రోసాఫ్ట్ ‘డిజైనర్ ఇమేజ్ జెనరేటర్’ను ఉపయోగించి టేలర్ స్విఫ్ట్‌కు చెందిన డీప్‌ఫేక్ అశ్లీల దృశ్యాలు రూపొందాయని ఆ దేశ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

