Ballistic Missile Technology: పాకిస్థాన్‌కు మిస్సైల్ టెక్నాలజీ ఇచ్చిన చైనా కంపెనీలపై ఆంక్షలు
Ballistic Missile Technology: చైనా కంపెనీలు బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీని పాకిస్థాన్‌కు సరఫరా చేస్తున్నాయి. చైనాతో పాటు ఓ బెలారస్ కంపెనీ కూడా దీంట్లో ఉన్నది. ఆ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది.
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు రహస్యంగా బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీ(Ballistic Missile Technology)ని అందజేసిన మూడు చైనీస్ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. లాంగ్ రేంజ్ మిస్సైల్ టెక్నాలజీని కూడా పాక్‌కు ఇచ్చినట్లు చైనా కంపెనీలపై ఆరోపణలు ఉన్నాయి. జియాన్ లాంగ్డే టెక్నాలజీ డెవలప్మెంట్, తియాంజిన్ క్రియేటివ్ సోర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్, గ్రాన్‌పెక్ట్ కంపెనీ లిమిటెడ్‌తో పాటు బెలారస్‌కు చెందిన మిన్స్క్ వీల్ ట్రాక్టర్ కంపెనీపై కూడా ఆంక్షలు విధించారు. ఈ కంపెనీలు మానవ హనన ఆయుధాల తయారీ వ్యాప్తికి కారణం అవుతున్నాయని, అయితే ఒకవేళ పాకిస్థాన్ ఆ ఆయుధాల తయారీ, రవాణాకు పాల్పడితే సమస్యగా మారే ప్రమాదం ఉందని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు.
ఆయుధాల ప్రొక్యూర్మెంట్ను వ్యతిరేకిస్తున్నామని, ఆయుధాల సరఫరాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని మిల్లర్ తెలిపారు. పాకిస్థాన్‌కు మిత్రదేశమైన చైనా.. ప్రధానంగా ఆయుధాలు, రక్షణ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నది. పాకిస్థాన్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌కు కావాల్సిన వెహికల్ ఛాసిస్‌ను మిన్స్క్ వీల్ ట్రాక్టర్ ప్లాంట్ సరఫరా చేస్తున్నది. మిస్సైల్‌కు చెందిన ఫిల్మెంట్ వైండింగ్ మెషీన్‌ను చైనాకు చెందిన లాంగ్డే కంపెనీ సరఫరా చేస్తున్నది. ఫిల్మెంట్ వైండింగ్ మెషీన్ల ద్వారా రాకెట్ మోటార్ కేసుల్ని ఉత్పత్తి చేస్తారు. తంజిన్ సంస్థ స్టిర్ వెల్డింగ్ ఎక్విప్మెంట్ను సరఫరా చేస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

