చెక్కర కోసం కొట్లాట.. సూపర్మార్కెట్లో ఎగబడ్డ రష్యన్లు : వైరల్ వీడియో
రష్యా పరిస్థితి ఘోరంగా తయారైంది. ప్రపంచ దేశాలన్నీ ఏకమై రష్యాను ఏకాకిని చేశాయి. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడికి ప్రపంచమంతా
రష్యా పరిస్థితి ఘోరంగా తయారైంది. ప్రపంచ దేశాలన్నీ ఏకమై రష్యాను ఏకాకిని చేశాయి. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడికి ప్రపంచమంతా నిరసన తెలుపుతోంది. అయినా రష్యా తన చేష్టలను ఆపడం లేదు. ఉక్రెయిన్ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు రష్యా విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు రష్యా మొత్తం ఆర్థిక సంక్షోభం సంభవిస్తోంది. చాలా దేశాలు రష్యాకు దిగుమతులను నిలిపివేయడంతో వస్తువుల కొరత రష్యాను వేధిస్తోంది. అలా నిత్యావసర వస్తువుల ధరలు రష్యాలో ఆకాశాన్నంటాయి.
Сахарные бои в Мордоре продолжаются pic.twitter.com/hjdphblFNc
— 10 квітня (@buch10_04) March 19, 2022
తాజాగా ఓ సూపర్ మార్కెట్లో చెక్కర కోసం రష్యన్లు విచక్షణారహితంగా కొట్లాడుకున్నారు. ఒకరి దగ్గర ఉన్న చెక్కర ప్యాకెట్లను మరొకరు లాక్కున్నారు. ప్రస్తుతం చెక్కర రేట్లు కూడా రష్యాలో ఒక్కసారిగా పెరిగాయి. అయినప్పటికీ చెక్కర కొరత తీవ్రంగా ఉన్నది. దీంతో చెక్కర కోసం రష్యన్లు సూపర్ మార్కెట్ల బాట పట్టారు. చెక్కర కోసం కొట్లాడుకుంటున్న రష్యన్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

