Andrey Botikov: స్పుత్నిక్-వీ టీకా తయారు చేసిన శాస్త్రవేత్త హత్య !
Andrey Botikov:వైరాలజిస్ట్ బొటికోవ్ హత్యకు గురయ్యాడు. స్పుత్నిక్ వీ టీకా అభివృద్ధిలో ఆయన ఓ పరిశోధకుడు. ఇంట్లోనే ఆయన్ను బెల్టుతో ఉరివేసి చంపారు.
మాస్కో: రష్యా శాస్త్రవేత్త ఆండ్రూ బొటికోవ్(Andrey Botikov) అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. స్పుత్నిక్-వీ(Sputnik V) టీకాను అభివృద్ధి చేసిన సైంటిస్టుల్లో ఆయన ఒక్కరు. తన స్వంత అపార్ట్మెంట్లోనే ఆయన శవమై తేలారు. బెల్ట్తోటి బొటికోవ్ గొంతును నులుమేసినట్లు రష్యా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. గమలేయా నేషనల్ రీసర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మ్యాథమెటిక్స్ లో 47 ఏళ్ల బొటికోవ్ సీనియర్ పరిశోధకుడిగా చేస్తున్నారు. ఈ కేసులో హత్యకు పాల్పడిన అనుమానితుడిని అరెస్టు చేశారు.
29 ఏళ్ల ఓ అనుమానితుడు శాస్త్రవేత్తతో వాగ్వాదానికి దిగాడు. అయితే ఆ తర్వాత కోపంలో ఆ వ్యక్తి బొటికోవ్ను చంపినట్లు తెలుస్తోంది. డొమెస్టిక్ క్రైమ్ కింద మర్డర్ కేసు నమోదు చేశారు. వైరాలజిస్ట్ మృతిపై హత్య కోణంలో విచారణ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
హత్యకు పాల్పడిన వ్యక్తిని త్వరగానే పట్టుకున్నామని, విచారణ సమయంలో ఆ వ్యక్తి క్షమాభిక్ష కోరాడని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తికి క్రిమినల్ రికార్డు ఉందన్నారు. అతన్ని త్వరలో కోర్టులో హాజరుపరచనున్నారు.
వైరాలజీ సైంటిస్టు బొటికోవ్కు 2021లో ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చింది. దేశాధ్యక్షుడు పుతిన్ చేతుల మీదుగా ఆయన ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును అందుకున్నారు. రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ టీకాను సుమారు 18 మంది శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు. దాంట్లో బొటికోవ్ ఒకరు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

