నిషేధిత బాంబులను ప్రయోగిస్తున్న రష్యా.. ఏంటవి?
ఊహించని విధంగా తిరగబడుతున్న ఉక్రెయిన్ సేనల్ని తుదముట్టించేందుకు రష్యా నిషేధిత బాంబులను ప్రయోగిస్తున్నది. వీటిలో క్లస్టర్, కార్పెట్, వ్యాక్యూమ్ బాంబుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
ఊహించని విధంగా తిరగబడుతున్న ఉక్రెయిన్ సేనల్ని తుదముట్టించేందుకు రష్యా నిషేధిత బాంబులను ప్రయోగిస్తున్నది. వీటిలో క్లస్టర్, కార్పెట్, వ్యాక్యూమ్ బాంబుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
కార్పెట్ బాంబ్
రూపం: చిన్నచిన్న బాంబుల సమ్మేళనం.
ఎందుకు వినియోగిస్తారు: శత్రు టార్గెట్‌ను గుర్తించి వాటిపైనే కచ్చితంగా పేలేందుకు ఉపయోగిస్తారు.
ప్రక్రియ: క్లస్టర్ బాంబులలాగానే వీటిని విమానం నుంచి జారవిడుస్తారు. వీటిలో కొన్ని సెల్ఫ్ గైడెడ్ బాంబులు కూడా ఉంటాయి. అవి శత్రు టార్గెట్‌ను గుర్తించి వాటిపైనే కచ్చితంగా కార్పెట్లా కప్పబడుతాయి. అనంతరం పేలుతాయి. తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.ఈ బాంబులను వియత్నాం యుద్ధంలో అమెరికా భారీగా వాడింది. 2003లో ఇరాక్ ఆక్రమణ సమయంలో కూడా వాడారు.డబ్లిన్ ఒప్పందం ద్వారా ఈ బాంబులు ఎవరూ వాడరాదని నిషేధించారు. ఈ ఒప్పందం 2010 నుంచి అమల్లోకి వచ్చింది.
క్లస్టర్ బాంబ్

రూపం: చిన్నచిన్న బాంబుల సమ్మేళనం.
ఎందుకు వినియోగిస్తారు?: యుద్ధట్యాంకులు, సైనిక వాహనాలు, సైనికులను ఒకేసారి భారీగా నాశనం చేయటానికి వీటిని ఉపయోగిస్తారు.
ప్రక్రియ: విమానం నుంచి ఈ క్లస్టర్ బాంబును జారవిడుస్తారు. తొలుత ఈ బాంబు పేలినప్పుడు అందులో ఉండే గ్రెనేడ్ లాంటి చిన్నచిన్న బాంబులు నలుదిశలా దూరంగా విసిరివేయబడతాయి. అమెరికా తయారుచేసిన సీబీయూ-97 వంటి క్లస్టర్ బాంబుల్లో రెండువేల వరకు చిన్న బాంబులు ఉంటాయి. ప్రతి చిన్న బాంబుకు ఒక పారాచూట్ ఉంటుంది. విమానం ద్వారా ఆకాశం నుంచి వీటిని జారవిడిచిప్పుడు గాలిలోనే ఈ బాంబు పేలి అందులోని చిన్న బాంబులు చాలా విస్తీర్ణంలో వెదజల్లబడి భూమిని తాకిన వెంటనే పేలుతాయి. ఈ బాంబుల వల్ల కొన్ని కిలోమీటర్ల పరిధిలో తీవ్ర విధ్వంసం జరుగుతుంది.
వ్యాక్యూమ్ బాంబ్

రూపం: లోహపు పదార్థం, కార్బన్
ఎందుకు వినియోగిస్తారు: లక్షిత ప్రాంతం క్షణాల్లో భస్మీపటలం కావడానికి వినియోగిస్తారు.
ప్రక్రియ: దీని పేలుడు రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో బాంబు పేలగానే అందులోని కార్బన్ వర్గానికి చెందిన ఇంధనం మండిపోయి బాంబులోని చిన్నచిన్న లోహపు ముక్కలు నలుదిక్కులా బుల్లెట్లలా దూసుకెళ్తాయి. పేలుడుతో బయటకొచ్చిన కార్బన్ పదార్ధం రెండో దశలో గాలిలోని ఆక్సిజన్‌ను లాక్కొని భారీ ఆగ్ని, వేడి మేఘాలను సృష్టిస్తుంది. ఈ వేడి ఎంతలా ఉంటుందంటే బాంబు పేలుడు పరిధిలోపల ఉండే మనుషులు క్షణాల్లో బూడిదగా మారిపోతారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

