ఓ వ్యక్తిని కాపాడబోయి.. నీటిలో దూకి ప్రాణాలు కోల్పోయిన మంత్రి

మాస్కో: రష్యా ఎమర్జెన్సీ శాఖా మంత్రి ఎవజిని జినిచేవ్ తమ శాఖకు చెందిన ఓ ఉద్యోగిని కాపాడబోయి ప్రాణాలు విడిచారు. ఈ ఘటన రష్యా ఉత్తర ప్రాంతంలో చోటుచేసుకున్నది. విధుల్లో ఉండగానే మంత్రి మరణించినట్లు ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డ్రిల్ జరుగుతున్న సమయంలో ఆయన ఓ ప్రమాదానికి గురయ్యారు. ఎమర్జెన్సీ శాఖ నిర్వహిస్తున్న విన్యాసాల్లో పాల్గొనేందుకు మంత్రి జినిచేవ్ ఆర్కిటిక్ జోన్‌కు వెళ్లారని.. అక్కడ ఆయన నాటకీయ పరిణామంగా ప్రమాదానికి గురయ్యారని, ఓ వ్యక్తిని రక్షించబోయి మంత్రి మృతిచెందినట్లు ఆ శాఖ తెలిపింది. నోరిల్క్ సిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫైర్ స్టేషన్‌ను తనిఖీ చేసేందుకు మంత్రి అక్కడకు వెళ్లారు. కెమెరామెన్తో కలిసి ఓ బండ చివరలో నిలుచున్న సమయంలో.. ఆ కెమెరామెన్ నీటిలో పడిపోయాడు. అయితే అతన్ని కాపాడేందుకు మంత్రి నీటిలోకి దూకేశారు. కానీ అక్కడ ఉన్న వాళ్లకు ఏం జరుగుతుందో తెలియలేదు. డైవింగ్ సమయంలో దెబ్బ తగలడంతో మంత్రి జినిచేవ్ మృతిచెందినట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

