ఈ నాలుగు షరతులకు ఓకే అంటే.. తక్షణమే యుద్ధం ఆపేస్తాం : రష్యా
తాము విధించిన షరతులకు అంగీకరిస్తే ఉక్రెయిన్‌పై తక్షణమే యుద్ధాన్ని నిలిపేస్తామని రష్యా సోమవారం ప్రకటించింది. షరతులకు ఓకే చెబితే.. తక్షణమే సైనిక చర్యను నిలిపేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రెస్ సెక్రెటరీ డిమిత్రీ పెస్కోవ్ ప్రకటించారు. ఉక్రెయిన్ ప్రభుత్వం ముందు రష్యా నాలుగు షరతులను విధించింది. 1. సైనిక చర్యను ఆపాలి. 2. తటస్థంగా ఉండేలా రాజ్యాంగాన్ని మార్చాలి 3. క్రిమియాను రష్యా భూభాగంగానే గుర్తించాలి. 4. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా అంగీకరించాలి. ఈ నాలుగు డిమాండ్లను రష్యా ఉక్రెయిన్ ముందు ఉంచింది. వీటిని గనక ఒప్పుకుంటే తక్షణమే యుద్ధాన్ని నిలిపేస్తామని రష్యా ప్రకటించింది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తూనే వుంది. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తూనే వుంది. అంతర్జాతీయ సమాజం మొత్తుకుంటున్నా… పుతిన్ మాత్రం ఎవ్వరి మాటా వినడం లేదు. ఉక్రెయిన్ తమ దారిలోకి వచ్చేంత వరకూ బాంబుల వర్షం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు మరో సంచలన విషయం ప్రకటించారు. తమ శత్రు దేశాల జాబితాను పుతిన్ విడుదల చేశారు. బ్రిటన్‌తో సహా అందులో 31 దేశాలున్నాయి. ఈ విషయాన్ని రష్యా మీడియా వెల్లడించింది. అమెరికా, బ్రిటన్, ఉక్రెయిన్, జపాన్‌తో సహా యూరోపియన్ దేశాలను పుతిన్ తమ శత్రు దేశాలుగా ప్రకటించేశారు. యూరోపియన్ దేశాల్లో మొత్తం 27 దేశాలున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

