Russia announces ceasefire | ఉక్రెయిన్‌పై యుద్ధంలో మూడు రోజులు కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా.. ఎందుకంటే?
Russia announces ceasefire | చాలా ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కాస్త విరామం కనిపించనున్నది. ఈ ఏడాది మే 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు రష్యా ప్రకటించింది.
మాస్కో: చాలా ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కాస్త విరామం కనిపించనున్నది. ఈ ఏడాది మే 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. (Russia announces ceasefire) రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్, దాని మిత్ర దేశాలు విజయం సాధించిన 80వ వార్షికోత్సవం సందర్భంగా సీజ్ ఫైర్ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రకటించారు. మే 8 అర్ధరాత్రి నుంచి కాల్పుల విరమణ అమలులోకి వస్తుందని, మే10 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ మూడు రోజులు ఉక్రెయిన్‌పై అన్ని సైనిక చర్యలు నిలిపివేయాలని పుతిన్ ఆదేశించినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. అయితే కాల్పుల విరమణ సమయంలో ఉక్రెయిన్ సైనిక దళాలు ఉల్లంఘనలకు పాల్పడితే తమ సైన్యం తగిన రీతిలో ప్రతిస్పందిస్తుందని రష్యా హెచ్చరించింది.
కాగా, ఏప్రిల్ నెల ప్రారంభంలో ఈస్టర్ సంధిని పుతిన్ ప్రకటించారు. అయితే ఈ కాల్పుల విరమణ కాలంలో రష్యన్ దళాలు మూడు వేలకుపైగా ఉల్లంఘనలను పాల్పడ్డాయని ఉక్రెయిన్ ఆరోపించింది. మరోవైపు మందస్తు షరతులు లేకుండా ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మాస్కోలోని అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్తో పుతిన్ అన్నారు. అయితే యుద్ధాన్ని ముగించే యోచనలో పుతిన్ లేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

