Rishi Sunak: ప్రతిపక్షాల ప్రశ్నలను ఎదుర్కోనున్న రిషి సునాక్
Rishi Sunak:బ్రిటన్ పార్లెమంట్లో ఇవాళ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak)పై ప్రశ్నల వర్షం కురవనున్నది. దేశాన్ని ఆర్థిక సమస్యల నుంచి ఎలా గట్టెక్కిస్తారో రిషి ఇవాళ పార్లమెంట్‌కు వెల్లడించనున్నారు. మంగళవారం ఆ
లండన్: బ్రిటన్ పార్లెమంట్లో ఇవాళ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak)పై ప్రశ్నల వర్షం కురవనున్నది. దేశాన్ని ఆర్థిక సమస్యల నుంచి ఎలా గట్టెక్కిస్తారో రిషి ఇవాళ పార్లమెంట్‌కు వెల్లడించనున్నారు. మంగళవారం ఆయన బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. సాధారణంగా బ్రిటన్ పార్లమెంట్ బుధవారం రోజున ప్రైమ్ మినిస్టర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే పీఎంక్యూస్. సభ్యులు వేసే ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
బ్రిటన్ రాజకీయాల్లో పీఎంక్యూలకు విశేషమైన గుర్తింపు ఉంది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో ప్రతి బుధవారం ఈ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపడుతారు. సుమారు అరగంట పాటు కామన్స్ చాంబర్‌లోని ఓ బాక్సు నుంచి ప్రధాని సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. సభ్యులు వేసే ఏ సబ్జెక్ట్ అయినా ఆన్సర్ ఇవ్వాలి.
పీఎంక్యూస్ సమయంలో ప్రతిపక్ష నేత ఆరు ప్రశ్నలు వేస్తారు. ఈ ఘట్టంలో ఇదే రసవత్తరంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాక్‌బెంచ్ ఎంపీలతో పాటు ప్రభుత్వానికి చెందిన ఎంపీలు కూడా తమకు నచ్చిన ప్రశ్నలు వేసే అవకాశం ఉంటుంది. ప్రతి బుధవారం ఈ ప్రశ్నల పరంపరం కోసం సభ్యుల మధ్య చాలా గట్టి పోటీ ఉంటుంది.
దేశ ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించడమే ప్రధాని రిషి సునాక్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. రానున్న కొన్ని నెలల్లో ఆయన పాలన ఎలా ఉంటుందో, ఆయన అధికారానికి ఏం అవుతుందో అన్న అంశాలను ఈ సవాలే స్పష్టం చేయనున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

