Rent a Girlfriend | పెళ్లికాని యువకులకు బంపర్ ఆఫర్.. అద్దెకు గర్ల్‌ఫ్రెండ్.. వెలుగులోకి వచ్చిన కొత్త బిజినెస్
Rent a Girlfriend | ఇచట గర్ల్‌ఫ్రెండ్ లభించును! వినడానికి చాలా ఎగ్జైట్‌గా ఉంది కదూ.. ఇప్పుడు ఈ ఆఫర్ చాలా ట్రెండింగ్‌గా మారింది. అయితే ఇది మన ఇండియాలో లేదు. మన పొరుగు దేశమైన చైనాలో ఇప్పుడు అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌ను ఇవ్వడం ట్రెండ్‌గా మారిపోయింది.
Rent a Girlfriend | ఇచట గర్ల్‌ఫ్రెండ్ లభించును! వినడానికి చాలా ఎగ్జైట్‌గా ఉంది కదూ.. ఇప్పుడు ఈ ఆఫర్ చాలా ట్రెండింగ్‌గా మారింది. అయితే ఇది మన ఇండియాలో లేదు. మన పొరుగు దేశమైన చైనాలో ఇప్పుడు అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌ను ఇవ్వడం ట్రెండ్‌గా మారిపోయింది. ప్రేయసి లేని యువకులు వీకెండ్స్, హాలీ డేస్ టైమ్‌లో ఇలా గర్ల్‌ఫ్రెండ్‌ను రెంట్‌కు తీసుకెళ్లడం ఇప్పుడు డ్రాగన్ దేశంలో ఎక్కువైపోయిందట. చాలా రోజులుగా సీక్రెట్‌గా కొనసాగుతున్న ఈ వ్యవహారం ఒక స్ట్రింగ్ ఆపరేషన్‌లో బయటపడింది. అంతేకాదు ఈ ట్రెండ్ మొదలవ్వడానికి వెనుక ఉన్న కారణం ఇప్పుడు అందర్నీ షాక్‌కు గురిచేస్తుంది కూడా.
ఎలా బయటకొచ్చింది?
అమ్మాయిలు కావాలంటే రెంట్‌కు ఇస్తున్నారని.. దీనికోసం పలు వెబ్‌సైట్స్ కూడా ఉన్నాయని తెలిసిన ఓ రిపోర్టర్ స్ట్రింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాడు. చైనాలోని నాజియాంగ్కు చెందిన సదరు రిపోర్టర్ తనకు తెలిసిన ఒక వెబ్సైట్లో లాగిన్ అయి.. తనకు గర్ల్‌ఫ్రెండ్ కావాలని ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ఇచ్చిన కొద్దిరోజులకే అతనికి ఒక యువతి నుంచి ఫోన్ వచ్చింది. అతను ఇచ్చిన ప్రకటన చూశానని.. అతనికి గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండేందుకు సిద్ధమేనని చెప్పింది. ఇందుకోసం రోజుకు వెయ్యి యువాన్లు ( రూ.12వేలు ) ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనికి అతను అంగీకరించడంతో ఇద్దరూ కలుసుకున్నారు. ఆ సమయంలో ఆ అమ్మాయి నుంచి పలు ఆసక్తికర విషయాలు రాబట్టాడు. ప్రస్తుతం తాను డిగ్రీ చదువుతున్నానని.. ఖాళీ సమయాల్లో ఇలా గర్ల్‌ఫ్రెండ్‌గా రెంట్‌కు వెళ్తున్నానని చెప్పింది. అయినప్పటికీ నెలకు రూ.60 వేల (5000 యువాన్లు ) వరకు సంపాదిస్తున్నానని ఆ యువతి బయటపెట్టింది. నార్మల్ డేస్ కంటే కూడా వీకెండ్స్, హాలీ డేస్‌లో ఎక్కువ మొత్తంలో చెల్లిస్తారని కూడా బయటపెట్టింది.
ఈ కల్చర్ ఎందుకు మొదలైంది?
చైనాకు చెందిన యువతీయువకులు ఇప్పుడు పెండ్లి, పిల్లల కంటే కూడా ఎక్కువగా జీవితంలో సెటిల్ అవ్వాలనే చూస్తున్నారు. మంచి ఉద్యోగంలో చేరి తనకంటూ ఆస్తిపాస్తులు సంపాదించుకునే దాకా వాటిపై ధ్యాస పెట్టడం లేదు. పెండ్లి చేసుకోకపోవడమే కాదు కదా.. కనీసం లవ్ చేయాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. తమ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రయత్నిస్తున్న యువకులకు తల్లిదండ్రుల నుంచి వేధింపులు ఎక్కువైపోతున్నాయట. తొందరగా పెండ్లి చేసుకోవాలని.. పిల్లలను కనాలని ఒత్తిడులు వస్తున్నాయట. ఇలాంటి ఒత్తిడులు ఎక్కువ కావడంతో తల్లిదండ్రుల నుంచి తప్పించుకునేందుకు ఇలా గర్ల్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకోవడం మొదలుపెట్టారట. ఇలా రెంట్‌కు అమ్మాయిని తీసుకుని.. ఆమెను తమ గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయం చేస్తున్నారు. ఆ తర్వాత కొద్దిరోజుల వరకు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ప్రెజర్ ఉండటం లేదట. ఇలా చాలారోజులుగా సీక్రెట్‌గా ఈ వ్యవహారం నడుస్తోంది. అయితే యువకుల నుంచి డిమాండ్ ఎక్కువ కావడంతో ఈ బిజినెస్ గురించి చాలామందికి తెలిసిపోయింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

