ఫ్యాన్‌పై సెలబ్రిటీ ఫైర్ : మహిళా అభిమాని ఫోన్‌ను విసిరేసిన ర్యాపర్
సెలబ్రిటీలు ఫ్యాన్స్ పట్ల దురుసుగా ప్రవర్తించే ఉదంతాలు తరచూ వెలుగుచూస్తుంటాయి. తాజాగా ర్యాపర్ బ్యాడ్ బన్నీగా పేరొందిన బెనిటో ఆంటోనియా ఒకసియో ఓ మహిళా అభిమాని ఫోన్‌ను గుంజుకుని విసిరివేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
న్యూఢిల్లీ : సెలబ్రిటీలు ఫ్యాన్స్ పట్ల దురుసుగా ప్రవర్తించే ఉదంతాలు తరచూ వెలుగుచూస్తుంటాయి. తాజాగా ర్యాపర్ బ్యాడ్ బన్నీగా పేరొందిన బెనిటో ఆంటోనియా ఒకసియో ఓ మహిళా అభిమాని ఫోన్‌ను గుంజుకుని విసిరివేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెల్ఫీ కోసం అభిమాని ర్యాపర్ బ్యాడ్ బన్నీ ముఖానికి దగ్గరగా రావడంతో చిర్రెత్తుకొచ్చిన ర్యాపర్ ఆమెకు షాక్ ఇచ్చాడు.
Adivina… fuaaaap pic.twitter.com/T96HighoxQ
— Félix Victorino (@donfelixspm) January 2, 2023
మహిళ చేతిలో నుంచి ఫోన్‌ను లాక్కున్న ర్యాపర్ దాన్ని దూరంగా విసిరివేయడంతో ఆమె కంగుతింది. ర్యాపర్ తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి వేదిక వద్దకు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా ఇప్పటివరకూ 1.26 లక్షల మంది వీక్షించారు. ట్విట్టర్లో ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై ర్యాపర్ స్పందించారు.
ఎవరైనా అభిమాని తనకు హలో చెప్పేందుకు, మాట్లేడేందుకు, కలిసేందుకు తన వద్దకు వస్తే వారికి తాను ఎంతో గౌరవం ఇచ్చి పలకరిస్తానని చెప్పారు. ఎవరైనా ఫోన్ తన ముఖంపైకి తీసుకువస్తే అది తన పట్ల అమర్యాదకరంగా వ్యవహరించినట్టు భావిస్తానని, వారిని అదే రీతిలో ట్రీట్ చేస్తానని ఆయన ట్వీట్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

