న్యూయార్క్: డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి రాఫెల్ వార్నాక్.. జార్జియా సేనేట్ పోరులో విజయం సాధించారు. దీంతో సేనేట్‌లో డెమోక్రటిక్ పార్టీ సీట్ల సంఖ్య 51కి చేరుకున్నది. ఈ విక్టరీతో ఆ పార్టీ సేనేట్‌లో మెజార్టీ సాధించినట్లు అయ్యింది. రిపబ్లికన్ అభ్యర్థి హెర్షల్ వాల్కర్ పై సుమారు 40 వేల ఓట్ల తేడాతో వార్నాక్ గెలుపొందారు. తనను గెలిపించిన మద్దతుదారులకు వార్నాక్ థ్యాంక్స్ తెలిపారు. జార్జియా ఫలితం మధ్యంతర ఎన్నికల్లో ఒకరకంగా రిపబ్లికన్ పార్టీకి నిరాశనే మిగ్చిలింది. కేవలం స్వల్ప మెజారిటీతో మాత్రమే రిపబ్లికన్ పార్టీ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో నెగ్గింది.