ఎంవీ ఎక్స్‌ప్రెస్ పెరల్ నౌకలో అగ్నిప్రమాదం.. అదుపులోకి మంటలు

కొలంబో: శ్రీలంకలోని కొలంబోలో ఎంవీ ఎక్స్‌ప్రెస్ పెరల్ అనే కార్గో నౌకలో భారీ స్థాయిలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఆ మంటల్ని ఆర్పేందుకు శ్రీలంక, ఇండియా సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఎంవీ ఎక్స్‌ప్రెస్ పెరల్ నౌకలో వ్యాప్తిస్తున్న మంటల్ని ఆదుపులోకి తెచ్చినట్లు అధికారులు చెప్పారు. భారీగా ఎగిసిపడిన మంటల్ని కంట్రోల్ చేసినట్లు శ్రీలంకలో ఉన్న భారతీయ హై కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. మంటలు తగ్గడంతో.. నౌక ఇప్పుడు కాస్త కనిపిస్తున్నది. మంగళవారం కొలంబో తీరం వద్ద ఉన్న పెరల్ నౌకలో పేలుడు సంభవించింది. ఆ కంటేనర్ షిప్లో సింగపూర్‌కు కెమికల్స్ తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది. దాంట్లో 1486 కంటేనర్లు, 25 టన్నుల నైట్రిక్ యాసిడ్‌తో పాటు ఇతర రసాయనాలు ఉన్నాయి.
భారత్‌లోని హజిరా నౌకాశ్రయం నుంచి ఈ కార్గో షిప్ బయలుదేరి వెళ్లింది. ఆ షిప్లో పిలిప్పీన్స్, చైనీస్, ఇండియా, రష్యా దేశాలకు చెందిన 25 మంది సభ్యులు ఉన్నారు. షిప్లో పేలుడు జరగగానే దాంట్లో ఉన్న సిబ్బందిని తరలించినట్లు శ్రీలంక నేవీ ప్రతినిధి కెప్టెన్ ఇండికా డిసిల్వా తెలిపారు. నౌకలో ఉన్న కంటేనర్ల నుంచి ఇంధనం లీకవుతున్నది. దీంతో సమీప బీచ్‌ల వద్ద ఆయిల్ పేరుకుంటున్నది. తీర ప్రాంత ప్రజలు నౌక నుంచి కొట్టుకువచ్చిన వాటిని ముట్టుకోవద్దు అని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

