Coronavirus: రకూన్ కుక్కల నుంచి మనుషులకు సోకిన కరోనా వైరస్.. డేటాను దాచిన చైనాపై డబ్ల్యూహెచ్‌వో సీరియస్
corona virus :కరోనా ఆనవాళ్ల గురించి కొత్త కోణం తెలిసింది. రకూన్ కుక్కుల నుంచి ఆ వైరస్ మనుషులకు సోకినట్లు తాజా స్టడీలో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన డేటాను చైనా దాచిపెట్టినట్లు డబ్ల్యూహెచ్‌వో ఆరోపిస్తోంది. జీన్ సీక్వెన్సింగ్ ద్వారా నిపుణుల బృందం ఈ అంచనాకు వచ్చారు.
వాషింగ్టన్: కరోనా వైరస్(Corna Virus) ఆనవాళ్ల గురించి చైనా తన వద్ద ఉన్న డేటాను షేర్ చేయడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కరోనా ఆనవాళ్ల(Corona Origins)కు చెందిన అంశంపై శుక్రవారం డబ్ల్యూహెచ్‌వో కొన్ని కీలక ఆధారాలను వెల్లడించింది. కరోనా డేటాను మూడేళ్ల క్రితం ఎందుకు రిలీజ్ చేయలేదని చైనా అధికారుల్ని డబ్ల్యూహెచ్‌వో అడిగింది. జనవరిలో ఆన్లైన్లో పబ్లిష్ అయిన ఆ డేటా ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదని కూడా ప్రశ్నించింది.
అయితే అంతర్జాతీయ నిపుణుల(Virus experts) బృందాలు ఆ డేటాను డౌన్లోడ్ చేసి అధ్యయనం చేస్తున్నాయి. కరోనా వైరస్ అక్రమంగా ట్రేడింగ్ చేసిన రకూన్ కుక్కల(Raccoon Dogs) నుంచి మనుషులకు సోకినట్లు ఆ డేటా ద్వారా శాస్త్రవేత్తలు అంచనాకు వస్తున్నారు. వుహాన్(Wuhan)లో ఉన్న హువనన్ సీఫుడ్ హోల్‌సేల్ మార్కెట్లో ఆ ఇన్ఫెక్షన్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కానీ చైనా అధికారులు జీన్ సీక్వెన్సింగ్(Gene Sequencing) డేటాను తొలగించడం వల్ల.. తుది ఫలితాలను పోల్చలేకపోతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మూడేళ్ల క్రితమే ఆ డేటాను షేర్ చేస్తే బాగుండేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్(Dr. Tedros Adhanom Ghebreyesus) తెలిపారు.
చైనా తన డేటా నుంచి తొలగించిన ఆధారాలను తక్షణమే అంతర్జాతీయ సమాజంతో షేర్ చేసుకోవాలని టెడ్రోస్ తెలిపారు. నక్క(Fox) లాంటి జంతువులైన రకూన్ కుక్కల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని డేటా ఆధారంగా నిపుణుల బృందం ఒక అంచనాకు వచ్చింది. వుహాన్ మార్కెట్లో సేకరించిన డీఎన్ఏ శ్యాంపిళ్లు(DNA Samples).. కరోనా వైరస్ జెనటిక్ నిర్మాణం ఒకే రకంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గురించారు. తొలుత రకూన్ కుక్కలకు వ్యాపించిన వైరస్.. ఆ తర్వాత ఆ జంతువుల ద్వారా మనుషులకు వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వుహాన్ మార్కెట్లో ఉన్న జంతువుల లాలాజలం(Animal Swabs) శ్యాంపిళ్లను సేకరించిన శాస్త్రవేత్తలు తీవ్ర స్థాయిలో అధ్యయనం చేపట్టారు. జన్యుపరమైన కోణంలో వైరస్ నిపుణులు స్టడీ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

