లండన్: ఇవాళ రెండవ ఎలిజబెత్ రాణి 96వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మ్యాటల్ సంస్థ క్వీన్ ఎలిజబెత్ బార్బీ డాళ్ను రిలీజ్ చేసింది. అచ్చం రెండవ ఎలిజబెత్‌లా ఉన్న ఆ బొమ్మను త్వరలో మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నారు. ఇంకా దానికి రేట్ ఫిక్స్ చేయలేదు. బార్బీ ద్వారా క్వీన్‌కు నివాళి అర్పిస్తున్నట్లు ఆ కంపెనీ చెప్పింది. రాణిగా బాధ్యతలు తీసుకుని 70 ఏళ్లు గడిచిన నేపథ్యంలో రెండవ ఎలిజబెత్ బార్బీ డాళ్ను రిలీజ్ చేస్తున్నట్లు కూడా తెలిపారు. ఐవరీ కలర్ గౌన్‌లో.. బ్లూ రిబ్బన్‌తో ఆ బొమ్మను తయారు చేశారు. బొమ్మలో ఉన్న ఫీచర్లు రాణి గత చరిత్రను తలపిస్తున్నాయి. పింక్, బ్లూ రిబ్బన్లతో క్వీన్ ఆకట్టుకుంటోంది.