లిజ్ ట్రస్‌కు పదవీ గండం!
బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తనున్నదా? ఇటీవలే కొత్త ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్‌కు పదవీ గండం పొంచి ఉన్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ట్రస్ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్,
లండన్, అక్టోబర్ 16: బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తనున్నదా? ఇటీవలే కొత్త ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్‌కు పదవీ గండం పొంచి ఉన్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ట్రస్ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్, ఆర్థిక విధానాలపై వ్యతిరేకతతో పాటు ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్ను తొలగించిన నేపథ్యంలో ట్రస్‌పై అధికార టోరీ పార్టీలోని కొంత మంది సీనియర్ ఎంపీలు తిరుగుబావుటాకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ప్రధానిగా ట్రస్‌ను తప్పించి.. ఆ స్థానంలో రిషి సునాక్ లేదా పెన్నీ మోర్డాంట్‌ను కూర్చొబెట్టాలని పావులు కదుపుతున్నట్టు బ్రిటిష్ మీడియా నివేదికలు చెప్తున్నాయి. లిజ్ ట్రస్‌ను ప్రధానిగా ఎన్నుకొని తప్పుడు నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల్లో పాల్గొన్న 62 శాతం మంది ఓటర్లు పేర్కొన్నారని ‘యూ గవ్’ సర్వే శుక్రవారం వెల్లడించింది. మరోవైపు లీసెస్టెర్, బర్మింగ్‌హామ్ హింసాకాండ నేపథ్యంలో 180 బ్రిటిష్ ఇండియన్ హిందూ సంఘాలు ప్రధాని ట్రస్‌కు లేఖ రాశాయి. ప్రభుత్వం జోక్యం చేసుకొని హిందూ కమ్యూనిటీకి రక్షణ కల్పించాలని కోరాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

